ఎల్లారెడ్డిమండలంలోని వెలుట్ల పేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని హుండీ చోరీకి గురైంది. సోమవారం రాత్రి దొంగలు ఆలయం ఆవరణలో ఉన్న హుండీ తాళం పగలగొట్టారు.
భక్తులు హుండీలో వేసిన డబ్బులు ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం ఆలయ బాధ్యులు హుండీ తాళం పగలగొట్టి ఉండడాన్ని గుర్తించారు. తలుపు తీసి చూడగా అందులో ఉండాల్సిన డబ్బులు ఖాళీ అయ్యాయి.
దొంగతనం విషయంపై ఆలయ బాధ్యులు, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు అడవి ప్రాంతంలో ఉన్న ఆలయం వద్దకు వెళ్లి దొంగతనంపై విచారణ జరిపారు.
