నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులతో అత్యంత రద్దీగా ఉండే ఖలీల్ వాడి లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడింది.పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఖలీల్ వాడి ప్రాంతంలో నేటి నుంచి వన్ వే కు కట్టుదిట్టమైన చర్యలు చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అత్యధికంగా ఆసుపత్రికి ఉన్నందున సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో నిత్యం రద్దీగా ఉండేది.ఆస్పత్రికి వచ్చే రోగులు, సందర్శకులు, సిబ్బంది వాహనాలన్నీ రోడ్లపైనే నిలుపుతున్నారు.
వాహనాల్ని రోడ్ల పై నిలపడంతో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు తలపోటు గా ఉండేది.దీనికోసం ఎన్ని సార్లు సమావేశాలు,అధికారులు చర్చించిన కొలిక్కి రాలేదు.
దీంతో నేరుగా పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలోని అత్యధికంగా ట్రాఫిక్ ఉండే ప్రాంతాలను వన్ వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు.దీంతో ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఇతర సిబ్బంది వన్ వే ను ఏర్పాటు చేసి పాలు కూడళ్ల వద్ద కానిస్టేబుల్ ను ఏర్పాటు చేసి ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.వన్ వే మార్గం..
ఎక్కడి నుంచి ఎక్కడికి..చెన్నయ్ షాపింగ్ మాల్ ఎదురు గల్లీ -తిలక్గార్డెన్ – రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు అలాగే ముదిరాజ్ హనుమాన్ ఆలయం నుంచి రాజీవ్ గాంధీ ఆడిటోరియం – ఎస్ఎస్ఆర్ కాలేజ్, కోర్టు చౌరస్తా నుంచి – కేంద్ర గ్రంథాలయం రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు ఏర్పాటు చేశారు.
