నిజామాబాద్ మెడి కల్ కాలేజీలో డే కాలర్ ఎంబిబిఎస్ విద్యార్థి రాహుల్ డ్డిపై ర్యాగింగ్ చేసిన ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీంతో అధికారులు స్పందించి సోమవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో యాంటి ర్యాగింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
శనివారం రోజున జరిగిన సంఘటన గురించి ఇరువర్గాల విద్యార్థుల వాదనలను విని అలాగే జుడా మెంబర్ తో మాట్లాడి. ఇమీడియట్ మెజర్స్ కింద ఐదుగురు ఇంట్రన్స్ ని ఆరు నెలలపాటు సస్పెన్షన్ అలాగే హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎన్. కృష్ణ మోహన్ తెలిపారు. అలాగే వారిని తదుపరి చర్యలు పోలీస్ శాఖ వారు సమర్పించిన నివేదిక ఆధారంగా తీసుకోవడం జరుగుతుందనీ అన్నారు.
ఈ సమావేశానికి అడిషనల్ కలెక్టర్, డిసిపి,ప్రభుత్వ హాస్పిటల్ సూపరెంట్ శ్రీనివాస్, అడిషనల్ సూపర్డెంట్ వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపల్, అన్ని శాఖల అధిపతులు, సిబ్బంది హాజరు అయ్యారు.
