HomeTelanganaNizamabadఅంతుచిక్కని హత్య..?- పట్టణంలోనే హత్య చేశారా..?- గోనేసంచిలో మృతదేహాన్ని మూటగట్టిన హంతకులు - పోలీసులకు సవాల్...

అంతుచిక్కని హత్య..?- పట్టణంలోనే హత్య చేశారా..?- గోనేసంచిలో మృతదేహాన్ని మూటగట్టిన హంతకులు – పోలీసులకు సవాల్ గా మారిన హత్య కేసు – హంతకుల కోసం ఆరా తీస్తున్న పోలీసులు

ఏకంగా ఓ సినిమాలో సీన్ ను తలపించే విధంగా ఆర్మూర్ లో హత్యకు తలపడ్డారు గుర్తుతెలియని హంతకులు. ఎక్కడో చంపివేసి.. మృతదేహాన్ని మూట కట్టి నిజాంసాగర్ కెనాల్ లో పడవేశారు.

ఈ హత్య ఉదంతం ఆర్మూర్ లో హాట్ టాపిక్ గా మారింది. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన పోతు నరేందర్ గత వారంలో 20వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు సమాచారం.

అదే రాత్రి వెంకటేశ్వర కాలనీలోని ప్రధాన రహదారికి సమీపంలో గోడౌన్లోకి మృతుడు ఓ స్త్రీ ఉన్న ఇంటి లోకి వెళ్లినట్టు సమాచారం. అనంతరం అది ఇంటిలోనికి ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చినట్టు పోలీసులు గుర్తించినట్టు వినికిడి.

అనంతరం మర్నాడు ఓ మూటగట్టుకొని హంతకులు బయటకు వెళ్లిన సిసి ఫుటేజ్ని సైతం పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా మృతుడి కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులకు అతని ఫోన్ లొకేషన్ ఆధారంగా హత్య ఉదంతం వెలుగు వచ్చినట్టు తెలుస్తోంది.

మామిడిపల్లి స్మశాన వాటిక సమీపంలో నిజాంసాగర్ కెనాల్ లో ఓ సంచిలో మూటగట్టి మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటకు వచ్చింది.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు సుంకేట్ లో మెడికల్ షాప్ ను నిర్వహిస్తున్నాడు. ఆర్మూర్ మాజీ ఎంపీపీ పోతు నరసయ్యకు సోదరుడు.

అయితే హత్య ఉదంతం బయటకు వచ్చినప్పటికీ హంతకులను ఇంకా గుర్తించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments