HomeDevotionalఅట్టహాసంగా ప్రారంభమైన సార్వజనిక్ రథ యాత్ర

అట్టహాసంగా ప్రారంభమైన సార్వజనిక్ రథ యాత్ర

భారీగా తరలివచ్చిన భక్తలుజెండా ఊపి ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..నిజామాబాద్ నగరంలో గణేష్ శోభయాత్ర అట్టహాసంగా మొదలయ్యింది.

స్థానిక దుబ్బా నుంచి సార్వజనిక్ ఆద్వర్యంలో ఈ శోభాయాత్ర ప్రారంభమైంది.అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్ జెండా ఊపి డంతో రథం ప్రారంభించడంతో ముందుకు కదిలింది.

ఈ శోభాయాత్ర లో ఎడ్ల జోడ్లతో ముందుకు నడవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రథ యాత్రను తిలకించడానికి వేలాది మంది భక్తజనం తరలివచ్చారు.దీంతో ఈ శోభాయాత్ర కనులపడగగా మారింది.

ఈ శోభాయాత్ర దుబ్బ నుంచి ప్రారంభమై నుంచి పవన్ టాకీస్, గురుద్వార్, గాజుల్పేట్, గోల్ హనుమాన్, పాటీగల్లి, పులాంగ్, చివరగా వినాయక్ నగర్ లోని వినాయకుల బావిలో నిమజ్జనం జరుగుతుంది.

ఈ ఊరేగింపులో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య భద్రత యంత్రాంగం చాలా పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. గతంలో ఊరేగింపు ఎడ్లపై జరిగినప్పుడు 45 జతల ఎడ్లు ఉండేవని కానీ కాలక్రమేనా వ్యవసాయంలో ఎడ్ల బండ్ల కనుమరుగు అయిపోవడంతో దశాబ్ద కాలంగా రథం లాగడానికి ఎడ్లను సమకూర్చడం కష్ట తరం అయింది.

కానీ ఆనవాయితీగా కొనసాగించాలనే పట్టుదలతో వివిధ ప్రాంతాల నుంచి 10 నుంచి 15 ఎడ్ల జతల ఎడ్లను అద్దెకు తెప్పిస్తున్నారు. సంప్రదాయ నృత్యాలు వెరసి ఉండ్రాలయ్యను తల్లి గంగమ్మ ఒడికి సాగ నంపాయి.

గణపతి బొప్పా మోరియా … ఆదా లడ్డూ చోరియా అంటూ భక్తులు హోరె త్తిన నినాదాలతో గణపయ్యకు ఘనమైన వీడ్కోలు పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments