మానవత్వమా నీవేక్కడ ఈ ప్రశ్నకు సమాధానం వెత్తుకునే పరిస్థితి ఉంది. ఐనావాళ్ళు వద్దనుకున్నారో ఏమె..వదిలేసి వెళ్లిపోయారు.అంత్యక్రియలకు నోచుకోక కోన్ని రోజులుగా ఆ శవం అలా ఉండిపోయింది. పురుగులు చీమలు పట్టి కుళ్ళిపోయింది.
ప్రాణం వదిలే ఆ క్షణం ఆ వృద్దుడు ఎంతటి నరకయాతన పడ్డాడో ఏమె పాపం. చనిపోయాక కూడా ఎవరు చూడక ఐనా వారు ఎవరు దగ్గర లేక ప్రాణం వదిలేసాడు.
పాపంఎవరు లేక ఎవరు రాకపోవటంతో ఇందల్వాయి ఎస్.ఐ ఆ అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించమని ఆదివారం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థను కోరగా సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను నిర్వహించినట్లు ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి జయదేవ్ వ్యాస్, నరేష్ రెడ్డి ఇందల్వాయి పోలిస్ సిబ్బంది ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
