ఎప్పటిలాగే ఈసారి బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం నిర్వహించారు.గణపతి వద్ద పెట్టిన ఈ లడ్దు రూ.39 లక్షలకు సామ ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ గణేశుడి లడ్డూ ధర రూ.35 లక్షలు పలుకగా.. ఈ సారి రూ.4 లక్షలు అదనంగా లడ్డూ ధర పలికింది.
అర్బన్ గ్రూప్‌కు చెందిన ప్రణీత్ రెడ్డి లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు1994లో లడ్డూ వేలం పాట మొదలవగా.. తొలిసారి రూ.450 ధర పలికింది. ఇక అప్పటి నుంచి లడ్డూ ధర అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.
ఈ ఏడాది రూ.39 లక్షలకు చేరింది. బాలాపూర్ వినాయకుడి లడ్డూను సొంతం చేసుకుంటే సుఖసంతోషాలతో పాటు సిరిసంపదలూ కలుగుతాయని భక్తుల నమ్మకం. లడ్డూ వేలం ముగిసిన అనంతరం బాలాపూర్ గణేశ్ విగ్రహం నిమజ్జనం ఊరేగింపు ప్రారంభమైంది. బాలాపూర్ వినాయకుడిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.
