ఆర్టీసీ లో ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించే దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుంది.అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.టీడబ్ల్యూయూ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
అన్ని జిల్లాల సిటీ కాంగ్రెస్ అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు పీసీసీ నుంచి సమాచారం అందించారు.ఎమ్మెల్యేఎమ్మెల్సీ లు నియోజకవర్గ ఇంచార్జ్ లు .
తమ తమ నియోజకవర్గాల పరిధిలోని ఆర్టీసీ డిపోలలో కాంగ్రెస్ అనుబంధ టీడబ్ల్యూయూ యూనియన్‌కు సంపూర్ణ సహకారాన్ని, సమన్వయాన్ని అందించాలని పీసీసీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి . టీపీసీసీ ఉపాధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను ఈ ఎన్నికల సమన్వయకర్తగా నియామకం అయ్యారు
