ప్రతికూల పరిస్థితులను అధిగమించి స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించడానికే ప్రభుత్వం సిద్ధం అవుతుంది. కొత్త బీసీ రిజర్వేషన్ తో ఎన్నికలకు వెళ్ళడానికి రేవంత్ కసరత్తులు చేస్తున్నారు.
వచ్చే నాలుగైదు రోజుల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో ను తెరమీదికి తేబోతుంది. బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేయనుంది. ఆ జీవో ఆధారంగా పంచాయతీ రాజ్ శాఖ మరో జీవో ఇచ్చి ఆ మేరకు స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలనేది సర్కార్ ఆలోచనగా ఉంది .
అందులో భాగంగానే ఆఘమేఘాల మీద ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల పక్రియ ను జిల్లా స్థాయి అధికారులు గుట్టుగా పూర్తి చేశారు. తాజా రిజర్వేషన్ల ఎలా అమలు చేశారనేది బయట ఎక్కడ ప్రస్తావించొద్దని.. ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్లఫై ఆంక్షలు విధించారు.
ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే తదుపరి ఎన్నికల పక్రియ శరవేగంగా మొదలు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. హైకోర్టు విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. మరికొంత కాలం గడువు కోరాలని భావించిన ప్రభుత్వం ఇప్పడు కొత్త జీవో ను తెరమీదికి తెచ్చింది
ఈ జీవో ను తెచ్చి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది.
ఎలాగో రిజర్వేషన్ ఫై 50 శాతం పరిమితి ఎత్తివేస్తూ ప్రభుత్వం తెచ్చిన ఉత్తర్వ్యూలకు గవర్నర్ ఆమోదం తెలిపింది.ఈ నేపథ్యంలో 42 బీసీ లకు రిజర్వేషన్ కల్పించే కొత్త జీవో కు ఎలాంటి ఆటంకాలు రాకపోవచ్చని ప్రభుత్వం భావిస్తుంది..
