గోడ కూలి న ఘటన లో తండ్రీకూతురు దుర్మరణం చెందారు ఈ విషాద ఘటన కోటగిరి మండలం కేంద్రంలో జరిగింది .
కోటగిరి కి చెందిన మహేశ్ (25), అతని భార్య మహేశ్వరి, రెండు నెలల చిన్నారితో వారి ఇంట్లో నిద్రపోయారు. మంగళవారం ఉదయం ఇంటిగోడ కు అనుకొనే ఉన్న పురాతన రైస్ మిల్ ప్రహరీ గోడ కూలిపోయి వారి ఇంటిపై పడింది.
ఈప్రమాదంలో మహేష్, రెండు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి వెంటనే మట్టిని తొలగించారు తీవ్రంగా గాయపడ్డ మహేశ్వరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు
