అదుపు తప్పి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వెళ్ళే దారిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
యూనివర్సిటీ వీసీకి చెందిన కారు డిచ్ పల్లి నుంచి నిజామాబాద్ వెళ్తున్న సమయంలో మాధవనగర్ బైపాస్ వద్ద కారుకు ముందున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో తప్పించే ప్రయత్నంలో కారులో పొలాల్లోకి దూసుకెళ్లింది.
ప్రమాద సమయంలో కారులో వీసీ యాదగిరిరావు లేరు డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
