నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ నేర రహితం గా మార్చడమే లక్ష్యం అని సిపి సాయి చైతన్య తెలిపారు. గతంలో దొంగతనాలు, ఇతరుల పై దాడులు, ప్రజలకు తెలియకుండానే మోసం చేయు సంఘటనలు ఎన్నో జరిగినాయి.
2017 నుండి 2025 వరకు కమ్యూనిటి కాంటాక్ట్ నేను సైతం క్రింద మొత్తం 8713 సి.సి టివిలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో చాలాకేసులలో రికవరి అయిన దాఖాలు చాలాతక్కువ, దొంగ దొరికిన అట్టి కేసులో ప్రాపర్టి రికవరి అవడం చాలాతక్కువగా ఉండేది.
లేదా ఇతరులపై దాడులు జరిగిన సమయంలో ఎవరు దాడులు చేసిని వారిని గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ప్రస్తుతం నిజామాబాద్ జ నరద్దీగల ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి, వాణిజ్య వ్యాపార సాముదాయాలు అప్పటికన్న ప్రస్తుతం చాలా ఎక్కువగా అయ్యాయి, సినిమా దియేటర్లు, బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారాలు, గ్యాస్ దుఖాణాలు, విధ్యాసంస్థలు, కాలేజీలు, యూనివర్సీటీ అపార్టుమెంట్లు, మొదలగునవి చాలా ఏర్పాటు కావడం జరిగింది.
ఆ మార్పుకు అనుకూలంగా ఎక్కడ అభివృద్ధి జరుగలేదు. అభివృద్ధి అనేది నేరారహిత సమాజంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కాని అలా కాకుండా ప్రతి రోజు ఎక్కడో ఒక చోట నేరం జరుగుతునే ఉన్నది. ఆ నేరం జరిగిన సంఘటన నుండి బయట పడేలోపు మరి యొక్క సంఘటన జరుగుతుంది.
కావున ఈ నేరాల నుండి విముక్తి పోందాలటే ప్రతీ చోట వారి వారి పరిధిలో సి.సి కెమోరాలు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. అలా చేసుకున్నట్లయితే కొద్ది మాత్రంగానైనా నేరాలు అదుపులో పెట్టవచ్చునీ అన్నారు.
అందుకోసం ప్రతి ఒక్కరు వారి వ్యక్తిగత ఆడాంబరాలకు (వృద్ధా ఖర్చు) లకు ఉపయోగించే ఖర్చులలో కొద్దిపాటి ఖర్చుతో తమ పరిధిలో సి.సి కెమోరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎంతో కొంత నేరాల నియంత్రణకు నీ వంతు సహయ సహకారాలు అందించిన వారు అవుతారు.
అలాగే మీ రక్షణ కోసం ఇంటి లోపల మరియు ఇంటి బయటమరియు వీధిలో అవసరం ఉన్న చోట సి.సి కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే ఏలాంటి నేరాలు జరుగ కుండా అరికట్టినవారు అవుతారు.
గతంలో కంటే ప్రస్తుత సమాజంలో అభివృద్ధి చెందుతున్న అన్ని ప్రాంతాలలో సి.సి కెమోరాలు తప్పకుండా అవసరం, ఎక్కడ ఎలాంటినేరాలు జరిగిన అతితక్కువ సమయంలో నేరం చేసిన వారిని పట్టు కోవడంమే కాకూండా, వారు దొంగిలించిన అన్ని వస్తువులను అతితక్కువ సమయంలో రికవరి చేయడం జరుగు తుంది.
ముఖ్యంగా మహిళల పై అసభ్యకరంగా ప్రవర్తించుట / కాలేజీలలో ఈవ్ టీజింగ్ చేస్తు , శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారు. ఇలాంటి చర్యల వలన ” సైబర్ క్రైమ్ రేటు” రోజు రోజుకు పెరుగుతున్నది.
ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండాలంటే సి.సి కెమోరాలు ఎంత గానో ఉపయోగపడుతాయని సూచించారు. ముఖ్యంగా వ్యాపార వాణిజ్య సంస్థలు, స్కూల్స్ / కాలేజీలలో జరిగే ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ చేసేవారు చేయకుండా ఉండడానికి ఎంతగానో ఉపయోగ పడుతాయి, కాలేజీ బయట వాహానలను ఇతరులు దొంగిలించిన లేదా డ్యామోజీ చేసిన, లేదా దాడులు జరిగిన ఈ సి.సి కెమెరాల సహాయంతో ఎంతో పసి కట్టవచ్చునని తెలిపారు.
అదేవిధంగా బ్యాంక్ లో, ఏటీఎం లలో లోపల మరియు బయట ప్రాంతాలలో సి.సి కెమెరాలు ఏర్పాటు చేయడం వలన ప్రజలకు ఎంతో మెలు చేసిన వారు అవుతారు. దేవాలయాలలో, మసీ దులలో, చర్చి లలో గురుద్వారలలో తప్పకుండా సి.సి కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి.
సినిమా ధియోటర్లలో ప్రధానంగా లోపలి భాగంలో బాల్కనీ లో గేటు ఎంట్రన్స్ లలో , పార్కింగ్ స్థలం లో తప్పక సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. దారి దోపిడీలు జరుగకుండా ఎంతో పర్య వేక్షిస్తాయి. అపార్టుమెంట్లు / హాస్పిటల్స్ లలో, ప్రధాన కూడళ్లలో రోడ్డు ప్రమా ధాలను అరికట్ట వచ్చుననీ అన్నారు. “
