పాఠశాల బస్సు కిందపడి బాలుడి మృతి చెందారు. ఈ ఘటన భీమగల్ మండలం రహత్నగర్లో మంగళవారం చోటు చేసుకుంది కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం..
శ్రీకాంత్ (3) తన అన్నను కృష్ణవేణి స్కూల్ బస్సులో ఎక్కించడానికి కుటుంబీకులతో వెళ్లిన సమయంలో బస్సు చక్రాల కింద పడ్డాడు.
డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడు కోమాలోకి వెళ్లడంతో వైద్యం కోసం నిజామాబాద్ తీసుకెళ్లగా మృతి చెందినట్లు తెలిపారు.
