Saturday, April 18, 2026
HomeCRIMEభార్యను హతమార్చిన భర్త..అక్రమ సంబంధమే కారణమా?

భార్యను హతమార్చిన భర్త..అక్రమ సంబంధమే కారణమా?

అక్రమ సంబంధం పెట్టుకుందనే నెపంతో ఓ భర్త భార్యను హతమార్చాడు. ఈ ఘటన ఆర్మూర్ లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వారా కాలనీ లో కిరాయి ఇంట్లో నివాసం ఉండే వడ్ల జగదీష్ కు మెదక్ జిల్లా కు చెందిన గుజరాత్ నుండి వలన వచ్చిన సుతర్ జగదీష్ @ వడ్ల జగదీశ్ తో వడ్ల మమత(40) తో 14 సంవత్సరంల క్రితం పెద్దలు కుదిర్చిన పెండ్లి జరిగింది.

వారికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగదీష్ కు తన భార్య మామిడిపల్లి కి చెందిన చిట్టీ తిరుమలేష్ అనే వ్యక్తి తో అక్రమ సంబంధం ఉందన్నే అనుమానం ఉండేది.

దీంతో మంగళవారం ఉదయం జగదీష్ బయటకు వెళ్లి తిరిగి తన ఇంటికి వచ్చేసరికి తిరుమలేష్ ఇంట్లో ఉన్నందున చూసి బయట గొళ్ళెం పెట్టగా తిరుమలేష్ వెనుక డోర్ నుండి పారిపోగా జగదీష్ కోపం తో బయట ఉన్న తిరుమలేష్ హోండా యాక్టీవ బండి పగులగొట్టి పోలీస్ స్టేషన్ కి వెళ్లి చెప్పగా పోలీస్ వారు ఇద్దరికీ నచ్చజేప్పి ఒప్పంద పత్రం రాయించినట్లు సమాచారం.

అయిన కూడా జగదీష్ ఇంటికి వెళ్లిన తర్వాత తన భార్య తో గొడవ పడి ఆమె ను కత్తి తో గొంతు కోసి చంపినట్లు స్థానికులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!