ప్రధాన రాజకీయ పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఎలాంటి ప్రతికూల పరిస్తితులైన అధిగమించి గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి.
అందుకే తమ భాగాలను ఆ నియోజకవర్గం నాలుగు వైపుల మోహరించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ,బిఆర్ యస్ పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి.
సిట్టింగ్ స్థానం ను ఎలాగైనా నిలబెట్టుకొని పార్టీ ప్రాబల్యం కాపాడుకోవాలనేది గులాబీ పార్టీ ఆలోచనగా ఉంది. జూబ్లీహిల్స్ లో గెలిచి ప్రభుత్వ ప్రతిష్ట ను పెంచుకోవాలనేది అధికార పార్టీ ఎత్తుగడ గా ఉంది. బీజేపీ ఎదో నామాత్రంగా కొట్లాడుతుంది.
అయినప్పటికీ ప్రచారం మాత్రం అట్టహాసంగా నే చేస్తుంది. అందుకే ప్రచారం క్షేత్రస్థాయిలో ఉండేలా కార్యచరణ రూపొందించిన ప్రధాన పార్టీలు ఆయా జిల్లాల నుంచి కీలక నేతలను జూబ్లీహిల్స్ కు రప్పించింది.
జిల్లాలో ని ఆయా పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు గత వారం రోజులుగా అక్కడే మకాం వేసి పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గం లో ముస్లిం మైనారిటీ వోట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బిఆర్ యస్ కాంగ్రెస్ పార్టీల కు చెందిన ముఖ్య మైనార్టీ నేతలంతా ప్రచారం కోసం వెళ్లారు.
కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్టార్ క్యాంపెనర్ ఉంటూనే రెండు డివిజన్ బాధ్యతలు చూస్తున్నారు. జిల్లాలో రెండు నియోజవర్గాల్లో పెత్తనం సాగిస్తున్న షబ్బీర్ అలీ దాదాపు పది రోజులుగా హైదారాబాద్ ను వీడి రాలేక పోతున్నారు.
ఉర్దూ అకాడమీ ఛైర్మెన్ తాహెర్ సైతం ఇక్కడే ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యారు. వీరితో పాటు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ ఇరవత్రి అన్వేష్ రెడ్డి మోహన్ రెడ్డి . నుడా ఛైర్మెన్ కేశ వేణు వినయ్ రెడ్డి లతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి లు అక్కడే ఉన్నారు.
అలాగే బిఆర్ యస్ నుంచి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్టార్ క్యాంపైనర్ హోదా లో ఉండగా ఎమ్మెల్యే షకీల్. జీవన్ రెడ్డి సురేందర్ బిగాల గణేష్ లు అక్కడే మకాం వేసి పనిచేస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే షకీల్ తన సతీమణి అయేషా సైతం మైనార్టీ ఏరియాల్లో ఇంటికి తిరుగుతున్నారు.
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లుగా ఉన్న ఎంపీ అర్వింద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పల్ సూర్యనారాయణ లు ఇంకా ఎన్నికల కార్యక్షేత్రంలో దిగలేదు.
కానీ జిల్లాకు చెందిన పసుపు బోర్డు ఛైర్మెన్ పల్లె గంగారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి లు అక్కడే మకాం వేసి పనిచేస్తున్నారు. ఆయా పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేసే నేతలంతా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార బాధ్యతల్లో బిజీ కావడంతో జిల్లలో రాజకీయ కార్యకలాపాలు స్తంభించాయి
