నిజామాబాద్ జిల్లా, వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా మండల కేంద్రానికి చెందిన ఎరుకల వెంకటేష్(25) గురువారం మోస్రా లోని వెంకటేశ్వర ఆలయ సమీపంలో సెల్ ఫోన్ టవర్ ఎక్కి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశాడు.
ఎందుకిలా చేశావని పోలీసులు ప్రశ్నించగా భూమి విషయంలో తన యొక్క కుటుంబ సభ్యులు నలుగురు తనను కొట్టడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడడం జరిగిందని పోలీసులకు సమాధానం ఇచ్చాడు.
సమీపంలో ఉన్న కానిస్టేబుల్ లక్ష్మీ నరసయ్య ఎరుకల వెంకటేష్ ను సముదాయించి ఇంటికి పంపించారు. టవర్ ఎక్కిన వెంకటేష్ వార్త మండల వ్యాప్తంగా వ్యాపించింది.
