ఆటో రిక్షా లో ఎక్కిన మాజీ సర్పంచ్ ను ఆటో డ్రైవర్ టోకరా ఇచ్చాడు. అతని వద్ద ఉన్న 50 వేల రూపాయల నగదు కాజేశారు.బాధితుడు లబోదిబో మంటూపోలీసులను ఆశ్రయించాడు.
నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ సమీపం లో గురువారం మధ్యాహ్నం జరిగింది సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ఆటో వాలా ను గుర్తించే పనిలో ఉన్నారు.
డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఈర్ల ఆశన్న గురువారం గ్రామస్థులతో కల్సి గుడి నిర్మాణ పనుల కోసం నగరానికి వచ్చాడు వినాయక్ నగర్ లో తన కూతురు ను చూడడానికి ఆటో రిక్షా లో వెళ్ళాడు అయితే అదే ఆటో లో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి కూడ ఉన్నాడు ఆటోడ్రైవర్ ఆశన్న ను మాటల్లో పెట్టగ ఆయన సైడ్ జేబులో ఉన్న నగదు 50 వేలు కాజేసాడు.
ఆటో దిగి వెళ్తుండగా జేబు లో చూస్తే నగదు లేదు ఈలోపు ఆటో రిక్షా ను అడ్డుకునే యత్నం చేయగా డ్రైవర్ అప కూడా వేగంగా వెళ్లి పోయాడు. ఆశన్న వెంటపడ్డ ఫలితం లేకుండా పోయింది దీనితో నేరుగా నాల్గో టౌన్ పోలీసులను ఆశ్రయించాడు దీనితో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు
