HomeCRIMEమల్టీ లెవల్ మార్కెటింగ్ గుట్టు రట్టు..రూ.కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్ల అరెస్ట్..నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య..

మల్టీ లెవల్ మార్కెటింగ్ గుట్టు రట్టు..రూ.కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్ల అరెస్ట్..నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య..

ఈజీ మనీకి అలవాటైన కొంతమంది మోసగాళ్లు పేద, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ప్రత్యేకంగా స్కీం(మల్టీ లెవల్‌ మోసాలు)లను డిజైన్‌ చేసి వారికి ఎరా చూపి నిండాముంచుతున్నారు.మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో నిజామాబాద్ లో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది.

మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో నిజామాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా 22 మంది, పరోక్షంగా 750 మందిని సభ్యులుగా చేర్పించి దాదాపు రూ. కోటిన్నర భారీ మోసానికి పాల్పడిన బీఎంబీ కంపెనీ గుట్టును నాలుగవ టౌన్ పోలీసులు రట్టు చేశారు.

ఈ సందర్భంగా బీఎంబీ కంపెనీ చెందిన నిందితుడు చంద్రశేఖర ప్రసాద్ ను అరెస్టు చేసినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

నగరంలోని కోటగల్లీ లో ఉన్నటువంటి బీఎంబీ మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన చంద్రశేఖర ప్రసాద్ ఓ వ్యక్తికి ఫోన్ చేసి కంపెనీ గురించి వివరించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు అనే ఆశ కలిగించి ఎరా వేసినట్లు తెలిపారు.

దీంతో బాధితుడు నమ్మి బీఎంబీ కంపెనీ యొక్క యాప్ ను ఇన్స్టాల్ చేసి వారు పంపిన లింక్ లకు రూ 84,398 లను వేర్వేరు లింకుల పంపినట్లు తెలిపారు.అదే కాకుండా బాధితుడు వారి రక్తసంబంధీకులను కూడా వేర్పించినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో బాధితుడు కంపెనీ వాలెట్ అకౌంట్ యందు జమ అయినటువంటి ఫేక్ అమౌంటు ను విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా నగదు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమని హుటాహుటిన నాలుగవ టౌన్ పోసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు దీనితో నాలుగవ టౌన్ ఎస్హెచ్ఓ సతీశ్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ ఆద్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.

విచారణలో ఈ కంపెనీ ఇంగ్లాండ్ దేశానికి చెందినట్లు గుర్తించారు. నిందితుడు ఈ విధంగా సుమారు 22 మందిని మోసం చేసినట్లు తెలిసింది. ఇట్టి బిఎంబి కంపెనీ పెట్టుబడులు పెట్టి సుమారు 750 మంది వరకు మోసపోయినట్లుగా తెలిపారు.

బాధతులు ఇట్టి బిఎంబి కంపెనీ యందు పెట్టుబడి పెట్టినటువంటి డబ్బుల విలువ సుమారు కోటి నుండి కోటిన్నర వరకు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బిఎంబి కంపెనీకి చెందినటువంటి యాప్ పనిచేయటం లేదు.

కంపెనీ పంపిన లింకులన్నీ కూడా చైనా టేస్డ్ లింకులని ఆ లింకుల ద్వారా పంపినటువంటి కోటి నుండి కోటినర రూపాయలు చైనా బేస్డ్ లింకులకు డ్రైవర్ట్ అయినట్లు సమాచారం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో,ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, నాలుగవ టౌన్ ఎస్హెచ్ఓ సతీశ్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments