ద్విచక్ర వాహనాల సైలెన్సర్లలో మార్పులు చేసి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహన దారు లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.నాలుగవ టౌన్ పరిధిలో ఎక్కువ శబ్దం చేసే సైలెన్సర్లను విక్రయిస్తున్న ఆటో మొబైల్స్ దుకాణాలపై సోదాలు చేసి సైలెన్సర్లను జప్తు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కొందరు వాహనాలకు అధిక శబ్దం చేసే సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని ఎన్నిసార్లు ద్వసం చేసిన ఆగడం లేదని పేర్కొన్నారు. ఈ సైలెన్సర్ల భారీ శబ్దం కారణంగా ఎంతో మంది సంబంధిత రోగాలకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నిషేధిత రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లు అమ్ముతున్నారనీ అలాగే వాటిని బిగిస్తున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు నాలుగు చోట్ల సోదలు చేసినట్లు తెలిపారు.
అందులో లోహియా ఆటోమొబైల్స్, విజయలక్ష్మి ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్, శివ శంకర్ ఆటోమొబైల్స్, ఫ్రీ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ అండ్ కన్సల్టెంట్లలో సోదలు చేసినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా గౌరవ పోలీస్ కమిషనర్ నిజాంబాద్ గారి యొక్క నిషేధ ఆజ్ఞలను ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా హానికర అధిక శబ్దాలు వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను అమ్ముతున్న శ్రీ లక్ష్మీనరసింహ ఆటోమొబైల్ అండ్ కన్సల్టెంట్లలో మొత్తం (08 ) కొత్త సైలెన్సర్లు అందులో అవి షాట్ పంజ-1. ఇండోర్ సైలెన్సర్-7 జప్తు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా సెకండ్ హ్యాండ్ సైలెన్సర్లు అమ్ముతున్నటువంటి విజయలక్ష్మి ఆటోమొబైల్స్ అండ్ సర్వీస్ సెంటర్ లలో మొత్తం (10) నిషేదిత రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లు అదేవిధంగా శివశంకర్ ఆటోమొబైల్స్ లో (11) సెకండ్ హ్యాండ్ నిషేదిత సైలెన్సర్లు జప్తు చేసినట్లు తెలిపారు.
నిషేదిత సైలెన్సర్లు అయినటువంటి నిషేదిత పంజాబ్ టైపు సైలెన్సర్లు మరియు షార్ట్ పంజా, ఇండోర్ సైలెన్సర్లను అమ్మిన యజమానులకు బిగించిన మెకానికులకు, నడిపిన వాహనదారులకు కూడా బాధ్యత ఉంటుంది అట్టి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని సీపీ హెచ్చరించారు.
