కాంగ్రెస్ పార్టీ కొత్త సారథులు కాసేపట్లో కొలువు దీరనున్నారు జిల్లా అగ్ర నేతలు హాజరు కానున్నారు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రానున్నారు.
నగర విధులన్నీ ఫ్లెక్సీ లతో నిండిపోయాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ లు సోమవారం ఉదయం 11:00 గంటలకు స్థానిక స్థానిక కాంగ్రెస్ భవన్ లో బాధ్యతలు తీసుకోనున్నారు .
ఉదయం 11 00 గంటలకు మాధవ్ నగర్ సాయి బాబా మందిరంలో పూజలు చేసుకొని అక్కడి నుండి ర్యాలీ ప్రారంభమై పులాంగ్ మీదుగా గోల్ హనుమాన్ చేరుకుని పూజలు నిర్వహిస్తారు.
తిరిగి పులాంగ్ మీదుగా ప్రగతి హాస్పిటల్ – ఎల్లమ్మగుట్ట – కోర్టు చౌరస్తా – రైల్వే స్టేషన్ చౌరస్తా మీదుగా కాంగ్రెస్ భవన్ చేరుకుని బాధ్యతలు స్వీకరిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 1: 00 గంటలకు లక్ష్మీ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకార సభ నిర్వహించనున్నారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు,రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు,రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు,వివిధ రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ లు,జిల్లా చైర్మన్లు,నియోజకవర్గ బాధ్యులు రానున్నారు
