HomeTelanganaNizamabadతెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అనుబంధంగ జీపీఓల జిల్లా నూతన కార్యవర్గ సంఘం ఎన్నిక

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అనుబంధంగ జీపీఓల జిల్లా నూతన కార్యవర్గ సంఘం ఎన్నిక

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అనుబంధంగాలి జీపీఓల జిల్లా నూతన కార్యవర్గ సంఘం ఎన్నిక నేడు నిజామాబాద్‌ జిల్లా గ్రామ పాలన అధికారుల నూతన కార్యవర్గ ఎన్నిక స్థానిక రెవెన్యూ భవన్లో నిర్వహించారు.

ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. నూతన జిల్లా అధ్యక్షుడిగా బియ్య సాయినాథ్‌, ప్రధాన కార్యదర్శిగా గుణ్ణం సంతోష్‌ , కోశాధికారిగా నల్ల ప్రశాంత్‌ ఉపాధ్యక్షులుగా అబ్బ సుధాకర్‌, నీరడి రమేష్‌, గంగాధర్‌ , మహిళా అధ్యక్షురాలిగా గంగాభవాని , కార్యవర్గ సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్నుకోబడిన నూతన అధ్యక్ష కార్యదర్శులు , కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. జీపీఓల హక్కుల కొరకు సమస్యల కొరకు నిరంతరం పాటు పడతామని అన్నారు.

ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని అలాగే నూతన కార్యక్రమం ఏర్పాటైన వెంటనే అందరూ కలిసి ట్రేస్‌ అధ్యక్షులు రమన్‌ రెడ్డిని , ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌ కుమార్‌ని మర్యాదపూర్వకంగా కలిసి వారి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది.

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌కు అనుబంధంగా ఉంటామని వారి సూచనలు సలహాలు పాటిస్తామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments