సంస్థ గత ఎన్నికల పక్రియ ను ఇటీవలే పూర్తీ చేసిన కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యాచరణ మీద ఫోకస్ పెట్టింది.పార్టీ పదవులు చేజారిన నేతలకు భవిష్యత్ భరోసా ఇవ్వడానికి సమాయత్తం అయ్యారు.ఇందుకోసం ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు.
పార్టీ పదవులు దక్కని నేతలతో ఆమె భేటీ అవుతున్నారు. వీరంతా ఆమె ను కలిసి విడివిడి కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వీరిలో ఒక్కరూ తప్పా మిగితా నేతలంతా పార్టీకి కోసం దశాబ్ధ దులుగా పనిచేస్తున్న వారే ఉన్నారు.
తాము ఎంత కాలంగా పార్టీలో ఉన్నది ఎలాంటి పదవుల్లో పనిచేస్తున్నది చెప్పుకొచ్చారు అలాగే ఈసారి ఎలాంటి పదవి ఆశించింది ? ఆమె అరా తీశారు.
ఎక్కువ మంది పార్టీ పదవులు ఆశించి భంగ పడ్డ వారే వుండడం గమనార్హం..నిజానికి పార్టీ పదవులకోసం ఆశపడి భంగ పడ్డ నేతలకు ఆమె ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం పార్టీ పదవులు దక్కని నేతల కోసం ఆమె టాస్క్ తీసుకున్నారని సమాచారం పీసీసీ చీఫ్ సొంత జిల్లా నుంచే ఆమె ఈ కార్యానికి శ్రీకారం చుట్టారు గత మూడు రోజుల క్రితం ఆమె కు సహాయకులుగా ఉన్న పీసీసీ నేతలు వేణుగోపాల్ నుంచి జిల్లా నుంచి పలువురు నేతలకు ఫోన్ లు వచ్చాయి .
మేడం మీతో మాట్లాడుతారు ఎమ్మెల్యే క్వార్ట్రర్ కు వచ్చేయండి అంటూ ఆహ్వానం వచ్చింది. ఇందులో భాగంగానే నిజామాబాద్ అర్బన్ ఆర్మూర్ రూరల్ సెగ్మెంట్ లకు చెందిన పలువురు నేతలకు ఈ తరహా ఆహ్వానాలు వచ్చాయి.
మీనాక్షి తో భేటీ అయిన వారిలో అర్బన్ నేతలే ఎక్కువగా ఉన్నారు అందులోనూ వీరంతా అర్బన్ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న వారే ! వీరిలో గాన్ రాజ్ ,రామర్తి గోపి,జావీద్ అక్రమ్ కౌడప్ శరత్ ,నరాల రత్నాకర్ లు ఆమె తో భేటీ అయిన వారిలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది రెండేళ్ల తరవాత పార్టీ పదవుల పందేరం ను ఈ మద్యే కొలిక్కి తెచ్చింది మొదట నామినేటెడ్ పోస్టు లను భర్తీ చేసిన కాంగ్రెస్ ఆ తరవాత పార్టీ పదవులను సీనియార్టీ ప్రాతిపదికగా క్యాడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోని పార్టీ పదవులు ఖరారు చేసారు.
అర్బన్ అధ్యక్ష పదవి కోసమే దాదాపు డజన్ మంది చివరికి దాక ప్రయత్నాలు సాగించారు.బొబ్బిలి రామకృష నియామకం కావడంతో మిగితా నేతలు అసంతృప్తి కి గురయ్యారు అలాగే డీసీసీ పదవి దక్కని శేఖర్ గౌడ్ తో పాటు మార చంద్రమోహన్ లను సైతం మీనాక్షి కలిసి భవిష్యత్తు లో పార్టీ లేదా ప్రభుత్వ పదవుల్లో కచ్చితంగా ప్రాధ్యానత దక్కేలా ఆమె అభయ హస్తం ఇచ్చారు
