ఈ రోజు తెలంగాణ విద్యార్థి పరిషద్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం తో ఏ ఓ ప్రశాంత్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు
ఈ సందర్భంగా న్యాల్కల్ రోడ్ లోని Orchid School లో విద్యార్థులపై అక్రమ బలవంతాలు, ఫీజుల కోసం వేధింపులు జరుగుతున్న విషయంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యాసంవత్సరపు ఫీజులు చెల్లించలేదని పేర్కొంటూ, పాఠశాల యాజమాన్యం 2025 విద్యార్థులను కొనసాగించడానికి అనుమతించేది లేదని బెదిరించడం, అలాగే గత ఫీజులు పూర్తిగా చెల్లించే వరకు TC ఇవ్వబోమని అన్యాయంగా ఒత్తిడి చేయడం జరుగుతోంది.
ఈ అక్రమ చర్యల వల్ల సుమారు ఒక సంవత్సరం పాటు ఇద్దరు విద్యార్థులు చదువుకు దూరమయ్యారు విద్యార్థులతో కలెక్టర్ కార్యాలయం కి వచ్చం అని అన్నారు .
విద్యా హక్కులను ఉల్లంఘించే ఈ వివక్షాత్మక ప్రవర్తన వెంటనే ఆపాలని అయిన డిమాండ్ చేశారు Orchid School పై తక్షణ దర్యాప్తు జరిపి,అక్రమ ఫీజుల వసూళ్లు,TC, అడ్మిషన్‌లపై పెట్టిన అడ్డంకులు,విద్యార్థులను చదువుకు దూరం చేసిన అంశాలపై ఆర్చిడ్ స్కూల్‌ను వెంటనే పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమ లో విద్యార్థులు ,తలిదండ్రులు పాల్గొన్నారు
