మహబూబ్ నగర్ లోని కబడ్డీ బాలుర అకాడమీలో ప్రవేశాల కోసం ఈ నెల 25, 26 తేదీల్లో ఉదయం 7.30 గంటల నుంచి ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు.
ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు పలు నిబంధనలు పాటించాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు 30.06.2010 నుంచి 01.07.2012 మధ్య జన్మించి, 14 నుంచి 16 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని తెలిపారు.
అలాగే బాలుర ఎత్తు 182 సెం.మీ పైబడి ఉండాలని స్పష్టం చేశారు. హాజరయ్యే అభ్యర్థులు జనన, విద్యా అర్హత పత్రాలు, 10 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డ్ మరియు స్థానికత ధ్రువపత్రం తదితర పత్రాలను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని ఈ కబడ్డీ అకాడమీ అవకాశాన్ని ప్రతి ఒక్క క్రీడాకారుడు సద్వినియోగం చేసుకోవాలని కోచ్ మీసాల ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు.
