డిచ్‌పల్లి మండలం సాంపల్లిలో అనుమతులు లేకుండా టేకు చెట్లను జేసీబీతో తొలగించిన వ్యవహారంలో సర్పంచ్ సంధ్య భర్త మాసూరి ప్రశాంత్‌కు అటవీశాఖ అధికారులు రూ.13,325 జరిమానా విధించారు.
గ్రామానికి చెందిన అంతరెడ్డి నర్సయ్య తాను ఏళ్లుగా పెంచుకుంటున్న టేకు చెట్లను తనకు ఎలాంటి నోటీసులు, అనుమతులు లేకుండా తొలగించారని అటవీశాఖ డీఎఫ్‌ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు వాల్టా చట్టం-2002 ప్రకారం జరిమానా విధించినట్లు తెలిసింది.
తాను పెంచుకున్న టేకు చెట్లను సర్పంచ్ భర్త జేసీబీతో తొలగించారని నర్సయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా అటవీశాఖ అధికారులు ఘటనపై పరిశీలన చేసి, చెట్ల తొలగింపునకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన నేపథ్యంలో రూ.13,325 జరిమానా విధించినట్లు సమాచారం. ప్రజాప్రతినిధి కుటుంబానికి చెందిన వ్యక్తిపై అటవీశాఖ చర్యలు తీసుకోవడం ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారింది.
