మైలార్ దేవుల పల్లి పరిధి లో బుధవారం అర్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో తండ్రి కూతురు మృతి చెందారు.స్కూటీ మీద వెళ్తున్న వారిని టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టడం తో వారిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు.
దుర్గ నగర్ ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్ ఖాన్ తన కూతురు షఫీరా బేగం తో కల్సి ఇంటికి వెళ్తున్నారు ఈ క్రమంలోనే దుర్గా నగర్ మెయిన్ రోడ్డు ఫై వెనుక నుంచి వచ్చిన టిప్పర్ స్కూటీ ని ఢీకొట్టింది దీనితో ఇద్దరు అక్కడి క్కడే మృతి చెందారు
మైలార్ దేవ్ పల్లి పోలీసులు హుటాహుటి వచ్చి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి టిప్పర్ కోసం గాలిస్తున్నారు
