HomeTelanganaNizamabadఘనంగా ప్రజా పాలన దినోత్సవం సంబరాలు... త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్...

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం సంబరాలు… త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి.. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు..

నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ఆయన, జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు.

ఈ వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ భుజంగరావు, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఆర్ఓ గీత, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఆర్కల నర్సారెడ్డి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments