పీడీఎస్ బియ్యం స్మగ్లర్ల నుంచి లంచం తీసుకుంటుండగా ఇద్దరు పోలీస్ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర సిఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి లను ఏసీబీ పట్టుకొని విచారిస్తుంది.
రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో నిందితులైన వ్యాపారుల కు సహాయం చెయ్యడానికి 8 న్నర లక్షల రూపాయల డీల్ కుదిరింది.ఈ నెల2 న మూడున్నర లక్షల రూపాయల తీసుకున్నారు మిగితా రూ.5 లక్షలరూపాయల కోసం ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి.
అదే పనిగా ఒత్తిడి చెయ్యడంతో బాధితుడి నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు వారు సంబంధిత అధికారులను పట్టుకోవడానికి ప్లాన్ చేసారు ఇందులో భాగంగా బుధవారం అర్ద రాత్రి రాంపల్లి లోని పెద్దమ్మ చెరువు వద్ద డబ్బులు తీసుకోవడానికి ఎస్సై జ్ఞానేందర్ వచ్చారు
బాధితుడి నుంచి డబ్బులు తీసుకునే క్రమంలోనే ఏసీబీ అధికారులను గమనించిన ఎస్సై మెరుపు వేగం తో అక్కడి నుంచి పారిపోయాడు కాని ఏసీబీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు ఆ తర్వాత సీఐని కూడా అదుపులోకి తీసుకున్నారు
ఆయన ఆదేశాల మేరకే డబ్బులు డిమాండ్ చేసి నట్టుగా ఎస్సై చెప్పడంతో ఏసీబీ అధికారులు ఇద్దరి మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసారు
