హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరపూరిత ఉద్దేశంతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తికి కోర్టు 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు చాదర్‌ఘాట్ ఎస్హెచ్ఓ కెబీ మురారీ తెలిపారు.
నమోదు చేసిన ఇ-పెట్టీ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. చాదర్‌ఘాట్ నివాసి ఫిరోజ్ ఖాన్ గతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతుండగా స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఇ-పెట్టీ కేసు (నెం. HYD2313PC263650448) నమోదు చేసి, సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 61(b) కింద నివేదికను కోర్టుకు సమర్పించారు.
ఈ కేసుకు సంబంధించి ఎస్‌టీసీ నంబర్ 3298/2026 కేసును హైదరాబాద్ 6వ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎం. భాస్కర్ బుధవారం విచారించారు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఆయనకు 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఆయన తెలిపారు.
ఈ దర్యాప్తును చాదర్‌ఘాట్ ఎస్సై బి. ఎల్లకృష్ణ నిర్వహించగా, కోర్టు డ్యూటీ ఆఫీసర్‌గా కానిస్టేబుల్ జి. సాయినాథ్ (PC-1586) బాధ్యతలు నిర్వర్తించారు.
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, అసాధారణ కార్యకలాపాల అణచివేతకు ఇటువంటి కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయని చాదర్‌ఘాట్ ఎస్‌హెచ్‌వో కెబీ మురారీ స్పష్టం చేశారు.
