నిజామాబాద్ నగరంలోని ముబారక్‌నగర్‌లో విజయ హైస్కూల్ సమీపంలో చాంపియన్స్ టైక్వాండో అకాడమీని ఆదివారం ప్రారంభించారు.ముఖ్యఅతిథిగా హాజరైన డీవైఎస్‌వో పవన్‌కుమార్ రిబ్బన్ కట్ చేసి అకాడమీని ప్రారంభించారు.
కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్‌కుమార్, కోచ్ గంగాధర్, నాగరాజ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.విద్యార్థులకు శిక్షణతోపాటు అవగాహనఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. విద్యార్థులు టైక్వాండోలో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు అకాడమీ ద్వారా నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
క్రీడలపై ఆసక్తి ఉన్న చిన్నారులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలినిజామాబాద్‌లో గుర్తింపు పొందిన టైక్వాండో అసోసియేషన్ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూచించారు.
గుర్తింపు పొందిన సంస్థల నుంచి జారీ అయ్యే ధ్రువపత్రాలకే పోటీల్లో, తదుపరి అవకాశాల్లో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇతర సంస్థల పేరుతో జారీ చేసే ధ్రువపత్రాల విషయంలో ముందుగా వాటి గుర్తింపును నిర్ధారించుకోవాలని, తల్లిదండ్రులు మోసపోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
