HomePOLITICAL NEWSసాగునీటి ప్రాజెక్టుల కోసం పాద యాత్ర ....బిఆర్ ఎల్పీ మీటింగ్ లో కెసిఆర్...

సాగునీటి ప్రాజెక్టుల కోసం పాద యాత్ర ….బిఆర్ ఎల్పీ మీటింగ్ లో కెసిఆర్…

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, దయనీయంగా మారిందని ఇదే అంశం మీద ప్రజల్లోకి వెళ్లానంటూ కెసిఆర్ వ్యాఖ్యానించారని సమాచారం .

త్వరలోనే తాను స్వయంగా కాళేశ్వరం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను సందర్శించనున్నట్లుగా బీఆర్ఎల్పీ భేటీ లో ప్రకటించారు ఆదివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది కేవలం కొద్ది మంది నేతలతో కాకుండా, ఏకంగా లక్ష మందితో కలిసి ఆ రెండు ప్రాజెక్టులవద్ద కు వెళ్తానని కెసిఆర్ పేర్కొన్నారు .,

రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం, ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై ప్రజలను చైతన్యపరిచేందుకు నీళ్ల కోసం త్వరలోనే భారీ పాదయాత్ర కూడా చేపడతానని ప్రకటించారు.

ఇక రేపటి నుంచి ప్రారంభం రాబోయే అసెంబ్లీ సమావేశాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే, మరోవైపు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను తీవ్రతరం చేయాలని కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.పాలన చేతకాకనే సీఎం రేవంత్ రెడ్డి బూతు చౌక బారు మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన థర్డ్ క్లాస్ లా ఉందని ప్రజలే చెబుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని అర్థమై, అందుకే ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. బూతుల వీరుడితో చర్చకు అసెంబ్లీకి రమ్మంటున్నారని, తన చావును కోరడం తప్పా ప్రభుత్వం ఏమి చేయలేక పోతుందన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments