HomeTelanganaHyderabadమహేష్‌కుమార్‌గౌడ్‌ నాయకత్వం అభినందనీయంపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి.. సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

మహేష్‌కుమార్‌గౌడ్‌ నాయకత్వం అభినందనీయంపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి.. సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర రథసారథిగా ఎదిగిన ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌ పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన సందేశాన్ని పంచుకున్నారు. బీసీ బిడ్డకు తెలంగాణ కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించడం కేవలం పదవి ఇవ్వడం మాత్రమే కాదని, సామాజిక న్యాయంపై కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో, రాహుల్‌గాంధీ మార్గదర్శకత్వంలో మహేష్‌కుమార్‌గౌడ్‌ పార్టీని బలోపేతం చేస్తూ, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ మహేష్‌కుమార్‌గౌడ్‌ సాగిస్తున్న ప్రస్థానం అభినందనీయమని సీఎం అన్నారు. ఇదే అంకితభావంతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు, మైలురాళ్లు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments