HomeTelanganaHyderabadపదవికి కెసిఆర్ రాజీనామా చెయ్యాలి ........మహాధర్నా లో పీసీసీ చీఫ్

పదవికి కెసిఆర్ రాజీనామా చెయ్యాలి ……..మహాధర్నా లో పీసీసీ చీఫ్

ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‎లోని ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ మహాధర్నా చేపట్టింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ ధర్నా లోపాల్గొన్నారు .

కేసీఆర్‎ను ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాలేని పరిస్థితి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరారు.

ఒకవేళ అల్లుడు, కొడుక్కి అవకాశం ఇద్దామనుకుంటే అనుకుంటే కేసీఆర్ శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ పాలనలో ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పులపాలైందని ఆరోపించారు.

కేసీఆర్ ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లారని.. ఓ వైపు ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తు్న్నామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుందని.. వెయ్యి రోజుల్లో ఎన్నో పనులు చేశామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments