కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 79వ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపూల్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఆమె భర్త చనిపోయిన దుఃఖాన్ని కూడా ఆపుకొని దేశంలో పార్టీ కోసం నిలబడిన వ్యక్తి అని,ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కూడా ఏనాడు అధికారం కోసం చూడలేదనీ అన్నారు.
సోనియాగాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజు ఎక్కువ కాలం కొనసాగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకురాలు అని, సోనియాగాంధీలు దేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు వెళ్లడానికి తోడుపడుతున్నాయని, ఎల్లప్పుడూ పార్టీ కోసం శ్రమించే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ దేవుడు ఆమెకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సోనియా గాంధీ నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే ప్రోగ్రామింగ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రధానిగా రాహుల్ గాంధీ నిలబెట్టుకుంటామని నగేష్ రెడ్డి అన్నారు.
సోనియా గాంధీ వల్లనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని సోనియా గాంధీకి ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని ఆయన అన్నారు.ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వం మోదీ నెహ్రూ కుటుంబం పై అసత్యపు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వాటిని ఎల్లప్పుడూ కాంగ్రెస్ నాయకులు తిప్పికొడుతున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, ను చైర్మన్ కేశ వేణు,పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్,పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్,జావీద్ అక్రమ్,రత్నాకర్,రామర్తి గోపి,విపుల్ గౌడ్,వేణు రాజ్,ఆదే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
