Sunday, April 19, 2026
HomeCRIMEజాతీయ రహదారి పై లారీ బోల్తా..

జాతీయ రహదారి పై లారీ బోల్తా..

లారీలో నుంచి చెలరేగిన మంటలు..నిజామాబాద్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇందల్వాయి సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూ గడ్డల లోడుతో వెళ్తున్న ఓ లారీ టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగి భారీగా పొగ కమ్ముకుంది.సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అయితే, ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!