జిల్లాలో మొదటి విడత లో 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ ఇది జిల్లా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన పై ఉన్న నమ్మకమని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో ప్రజా పాలన అందిస్తూ ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూనే వారి విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇల్లులేని పేద ప్రజలకు ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది అని పేర్కొన్నారు.
ఇందిదిరమ్మ ఇండ్లు ఇప్పటికే ఎన్నో అందించడం జరిగిందని, కానీ గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్ రూమ్ పేరుతో ప్రజల వద్ద కమిషన్లు తీసుకున్నారని అన్నారు. అదేవిధంగా రైతుల కొరకు రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగిందని, రైతు భరోసా పేరుతో ఎకరానికి సంవత్సరానికి 12 వేల రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, మళ్లీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని టిఆర్ఎస్ పాలనలో ఏ రోజు కూడా రేషన్ కార్డులు అందించలేదు అని ఈ సందర్భంగా తెలిపారు.
అధికారంలోకి రాకముందు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగి వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసి పాలనను గాడికి వదిలేసిన వ్యక్తి కెసిఆర్ అని, పేర్కొన్నారని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు 14 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం 84 లక్షల కోట్ల అప్పులోకి లాగిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఒకపక్క గత ప్రభుత్వం చేసిన రుణాలకు వడ్డీలు కడుతూనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ, స్కాలర్షిప్, వివిధ కాంట్రాక్టు బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తుందని తెలిపారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీలు తీసుకునే క్రమంలో కూడా కమిషన్లు తీసుకొని 11.5 రూపాయలకు వడ్డీ తీసుకోవడం జరిగిందని, ఇది కేవలం టిఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి అక్రమాలకు నిదర్శనమేనని వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మరియు జిల్లాలో సుమారు 80% సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంది అని నగేష్ రెడ్డి అన్నారు.
ఈ సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, సేవదల్ అధ్యక్షుడు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
