సిర్నాపల్లి శివారులో పేకాట స్థావరం పై రైడ్ చేసి 6 గురు పేకాట రాయుళ్ళు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈమేరకు మంగళవారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శసాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏ.సీ.పీ ఇంచార్జ్ మస్తాన్ ఆలి సూచనల మేరకు ఇన్స్పెక్టర్ సాయినాథ్ , ఎస్.ఐ గోవింద్ సిబ్బంది కలిసి నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నాపల్లి శివారులో పేకాట స్థావరం పై రైడ్ చేసి 6 గురు పేకాట రాయుళ్ళు ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
వారి నుంచి 6 సెల్ ఫోన్స్ , రూ 28,650 నగదు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం నవీపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐకి అప్పగించినట్లు తెలిపారు.
