మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కోర్టు కఠిన శిక్షలు విధించింది. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు నగరంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 10 మందికి గురువారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించారు.
అనంతరం వారిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ఎదుట హాజరు పరచగా ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 80,000 భారీ జరిమానా విధించారు. అలాగే, తీవ్రతను బట్టి మరో కల్లేపల్లి శ్రీకాంత్,షేక్ సమ్యుల్లాలకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం పొంచి ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
