HomeLaw and Orderలక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేయాలి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి..

లక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేయాలి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి..

తమకు ఇష్టమైన రంగంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని అంకిత భావంతో కృషి చేస్తే తప్పక విజయం సాధించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులను ఉద్బోధించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గురువారం ఆర్మూర్ మండలం మునిపల్లిలో గల మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్/డిగ్రీ కళాశాల వార్షికోత్సవానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్షలు సమీపించిన దృష్ట్యా కష్టపడి చదవాలని సూచించారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని, ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. ప్రతిభను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటే ఉన్నత అవకాశాలు తలుపు తడతాయని అన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం జరుగుతోందని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలను వీడిన కూడా తోటి విద్యార్థులను, గురువులను ఎన్నటికీ మర్చిపోకూడదని అన్నారు. క్రమశిక్షణ, నైతిక విలువలు పాటిస్తూ ఉన్నత స్థాయిలో రాణించడం ద్వారా అందరికీ స్ఫూర్తిగా నిలవాలని మార్గనిర్దేశం చేశారు. ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత విద్య కోసం మంచి ఆలోచనలతో కోర్సులను ఎంపిక చేసుకోవాలని, లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా ముందుకు సాగాలని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన వారికి, వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్.సీ.ఓ సత్యనాథ్ రెడ్డి, తహసీల్దార్ కిరణ్మయి, కళాశాల ప్రిన్సిపల్ అనూష, అర్చన, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ————————–నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments