సుద్దపల్లి గ్రామ సర్పంచ్ రూపా సతీష్ రెడ్డి వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు
ఈ సందర్భంగా రూపా సతీష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఐస్ క్రీమ్స్ తోపుడు బండ్లు వచ్చే వాళ్ళను నిషేధించడం జరిగింది ఈ యొక్క అమలు వచ్చిన రెండు తారీకు నుండి విధించడం జరిగిందని సర్పంచ్ తెలిపారు..
ఎందుకనగా కల్తీ ఐస్ క్రీం వల్ల పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది కావున గ్రామంలో అభివృద్ధి ఒకటే కాదు గ్రామంలో ఉన్నటువంటి పిల్లల ఆరోగ్యం కూడా ముఖ్యమని ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు.
దీనికి గ్రామస్తులు అందరు కూడా సహకరిస్తున్నారు గ్రామ అభివృద్ధి కమిటీ మా పాలకవర్గం సహకరిస్తుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి దిశ గా ముందుకు వెళ్తామని ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కూడా తీసుకొని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నిలుపుతామని ఈ సందర్భంగా సర్పంచ్ రూప తెలిపారు….
