Monday, April 20, 2026
HomeTelanganaNizamabadఫ్యూచర్ లైన్ స్కూల్‌లో ఘనంగా యూకేజీ చిన్నారుల గ్రాడ్యుయేషన్ వేడుకలు

ఫ్యూచర్ లైన్ స్కూల్‌లో ఘనంగా యూకేజీ చిన్నారుల గ్రాడ్యుయేషన్ వేడుకలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఫ్యూచర్ లైన్ స్కూల్‌లో యూకేజీ పూర్తి చేసిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు గ్రాడ్యుయేషన్ దుస్తుల్లో స్టేజ్‌పై సర్టిఫికేట్లు అందుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను అలరించాయి. స్కూల్ నిర్వహణ అందిస్తున్న నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులు ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లావణ్య, సంథ్య, గౌతమి ,మినాక్షి,శిరిష మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!