ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో సాగు భూములకు అత్యంత కీలకమైన నల్లమట్టి విషయంలో రైతులను మోసం చేసేందుకు దళారులు ప్రయత్నిస్తున్నారని, దీనిని అడ్డుకోవడానికి రైతులంతా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం వ్యవసాయ భూములకు నల్లమట్టి వేసే సమయం కావడంతో గిరాకీని ఆసరాగా చేసుకుని వ్యాపారులు రంగంలోకి దిగారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తూ, అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని బాలు మండిపడ్డారు. “మీరు దోచుకుంటున్న ఈ మట్టి మనకు అన్నం పెట్టే వ్యవసాయ భూములదని మర్చిపోకండి. తక్కువ ధరకే మట్టిని విక్రయించాలి. లేదంటే బాధితుల పక్షాన పోరాటం తప్పదు.”నల్లమట్టి తోలించేటప్పుడు భూమి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం ఉత్తమం. ఎకరాకు సుమారు 40 నుండి 50 ట్రాక్టర్ల లోడ్ల మట్టి అవసరమవుతుంది. ఇది భూమిలో తేమను నిలిపి ఉంచుతుంది.మెట్ట భూములకు:ఎకరాకు 20 నుండి 25 ట్రాక్టర్ల లోడ్లు పోస్తే భూమి సారవంతంగా మారుతుంది. మధ్యస్థ నేలలకు కేవలం 10 నుండి 15 లోడ్లు సరిపోతాయి. అవసరానికి మించి పోయడం వల్ల కూడా ఖర్చు పెరుగుతుంది తప్ప లాభం ఉండదు. రైతన్న చెమటోడ్చి సంపాదించిన సొమ్ము దళారుల పాలు కాకూడదు” అని మైలారం బాలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మట్టి రవాణాపై పోలీస్, రెవెన్యూ అధికారులు తక్షణమే దృష్టి సారించాలని, రైతులకు తక్కువ ధరకే మట్టి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నల్లమట్టిపై పూర్తి అధికారం రైతులకే ఉంటుందని, అధిక ధరలు చెల్లించి నష్టపోవద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.
రైతన్నను వంచించొద్దు.. ‘నల్ల’ దందాను సహించం!సాగు భూములపై రైతులకే పూర్తి హక్కు: మైలారం బాలు డిమాండ్”దేశానికి వెన్నుముక రైతన్న” అని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో వారికి మేలు జరగాలని ఎంఆర్పీఎస్ నేత మైలారం బాలు పేర్కొన్నారు.
RELATED ARTICLES
