Monday, April 27, 2026
HomeTelanganaNizamabadమొదలైన స్వీయ గణన నమోదు .....వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకున్న ఎంపీ అర్వింద్.... ఎమ్మెల్యే...

మొదలైన స్వీయ గణన నమోదు …..వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకున్న ఎంపీ అర్వింద్…. ఎమ్మెల్యే దన్ పాల్ ….కలెక్టర్ …. రెండు వారాల గడవు ……ఆతర్వాత ఇంటింటికి బృందాలు..

దశాబ్దాల కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు జన గణన ప్రక్రియ కు శ్రీకారం చుట్టింది. మొదట స్వీయ గణన పక్రియ మొదలు పెట్టింది నిన్నటి నుంచి మొదలైన స్వీయ గణన వచ్చే నెల 10 దాక చేసుకునే వెసులు బాటు కల్పించారు

ఆ తర్వాత ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి జన గణన పక్రియ ను చేపట్టనున్నారు.జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఇందుకు సంబందించిన ఏర్పాట్ల ను విస్తృతంగా చేస్తోంది. వీలైనంత ఎక్కువ మంది తమ వివరాలు ఆన్ లైన్ లోనే నేరుగా చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇందులో భాగంగానే కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం కలెక్టరేట్ లోని తన క్యాంపు కార్యాలయంలో స్వీయ నమోదు చేసుకున్నారు.

జన గణనలో ఎవరికి వారు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేలా అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ వెబ్ సైట్ https://se.census.gov.in ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఎంపీ అర్వింద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ లు సైతం నిజామాబాద్ నగరంలోని తన ఇండ్లలోనే స్వీయ గణన చేసుకున్నారు జన గణన ప్రక్రియను సులభంగా, సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది .

ఎవరైనా సరే ఆన్ లైన్ లోనే తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్ లో కానీ , మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు . ఈ నెల 26 నుండి మే 10వ తేదీ వరకు స్వీయ నమోదు చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు . జన గణనకు సంబంధించిన సమాచారాన్ని 15 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకునేలా ఉంది .

వివరాలు నమోదు చేసిన అనంతరం ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి జారీ చేస్తారు.ఆన్ లైన్ నమోదు పక్రియ గడవు తర్వాత ఫీల్డ్ ఎన్యుమరేటర్లు మే 11 నుంచి జూన్ 09 దాక క్షేత్రస్థాయిలో ఇంటికి వచ్చిన సమయంలో వారికి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐ.డి నెంబర్ ఇవ్వాలి .

ప్రజలు తమ వివరాలను ప్రస్తుతం ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకుంటే, ధృవీకరణ సమయంలో వారు ఇంట్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం ఉండదని, ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సమాచారాన్ని సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐ.డి ద్వారా ఎన్యూమరేటర్ పరిశీలించి ధృవీకరిస్తారు .

దీనివల్ల ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండే వారు, విద్యార్థులు, వలస కార్మికులు, ప్రయాణాల్లో ఉన్న ప్రజలు కూడా జనగణనలో వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు ఆన్ లైన్ లో స్వీయ గణన చేసుకున్న వారు ఖచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేస్తేనే ఎన్యూమరేటర్లు నేరుగా వచ్చి వివరాలకు ఆమోదం ఇస్తారు. జనగణన ప్రక్రియకోసం సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!