హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్‍రే భార్య దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రక్తం మడుగులో పడి ఉన్న రంజన్‍రే భార్యను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు .
ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే రంజన్‍రే భార్య హత్య లో ఇంట్లో పనిచేసే వారి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
నేపాల్ ప్రాంతానికి చెందిన వారే ఇంట్లో పనిచేస్తున్నారు చోరీ ఉద్దేశంతోనే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కక్ష్య తో జరిగిందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటన స్థలాన్ని సీటీ సీపీ సజ్జనార్ పరిశీలించారు.
