HomeCRIMEగ్యాస్ నింపుతుండగా పేలిన కారు ట్యాంకు.. మూడు కార్లు, బైక్ దగ్ధం..

గ్యాస్ నింపుతుండగా పేలిన కారు ట్యాంకు.. మూడు కార్లు, బైక్ దగ్ధం..

గ్యాస్ నింపుతుండగా కారు ట్యాంకు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదం లో మూడు కార్లు, బైక్ దగ్ధమయ్యాయి. కామారెడ్డి పట్టణశివారు లోని దేవునిపల్లి గ్రామంలో ఓ కారులో సీఎన్జీ గ్యాస్ నింపుతున్నారు.

ఈ క్రమంలో కారు ట్యాంకు పేలడంతో దట్టమైన పొగలు వ్యాపించి కారు దగ్ధమైంది. దాంతో పాటు గ్యాస్ నింపుతున్న కారు పక్కన పార్కింగ్ చేసి ఉన్న మరో రెండు కార్లు, ఓ బైక్ దగ్ధమయ్యాయి. కార్లు దగ్ధమయ్యే సమయంలో భారీగా శబ్దాలు రావడంతో స్థానికులు పరుగులు తీశారు.

వెంటనే ఫైర్స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్స్టేషన్ అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఫైర్సిబ్బంది సమయానికి రాకపోయి ఉంటే చుట్టు పక్కల ఇళ్లకు మంటలు వ్యాపించి ఉండేవని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments