HomeCRIMEఅక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల పీడీఎస్ పట్టివేత..

అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల పీడీఎస్ పట్టివేత..

నగరంలోని పూలంగ్ చౌరస్తా పరిధిలో ఆదివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న సుమారు 20 క్వింటాళ్ల పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం… సారంగాపూర్ ప్రాంతానికి చెందిన అబ్బాస్ అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది.

దీనిపై నిఘా ఉంచిన నాలుగో టౌన్ పోలీసులు పూలంగ్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక అశోక్ లేలాండ్ లగేజీ వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా, అందులో భారీగా బియ్యం మూటలు లభ్యమయ్యాయి.

ఎలాంటి అనుమతులు లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న సుమారు 20 క్వింటాళ్ల బియ్యాన్ని, దానికి ఉపయోగించిన అశోక్ లేలాండ్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు నిందితుడు అబ్బాస్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు నాలుగో టౌన్ పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments