ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మహిళా సోదరీమణులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందనీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు తెలిపారు
ప్రతి నెల చివరి శుక్రవారం నాడు లలిత దేవి సహస్ర నామావళి మరియు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనీ ఇందులో భాగంగా మహాలక్ష్మి,మహా సరస్వతి, మహాకాళి అమ్మవార్లకు భక్తితో పూజలు నిర్వహించి అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు
ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా పాడిపంటలు సమృద్ధిగా పండేలా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తునామాని తెలిపారు కార్యక్రమ అనంతరం కుంకుమార్చన లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రిషీ పంతులు మరియు మహిళలు పాల్గొన్నారు
