వడదెబ్బ తగిలి గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన శుక్రవారం లింగంపేట మండలంలోని శెట్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. శెట్పల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కందూరి కుర్మా సాయన్న 70 గత మూడు రోజులుగా గొర్రెలు మేపడానికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గొర్రెలు మేపడానికి వెళ్లిన సాయన్న ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడని.
మంచి నీళ్ళు ఇవ్వమని అడిగి అక్కడే కుప్పకూలిపోయి ప్రాణం కోల్పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలానికి స్థానిక సర్పంచ్ అట్టెం శ్రీనివాస్, ఏఎన్ఎం రాధిక, జిపిఓ ఆషామ్ అలీ కలిసి వెళ్ళి మృతదేహాన్ని పరిశీలించారు.
కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. స్థానిక జిపిఓ ద్వారా సమాచారాన్ని తాసిల్దార్ కు తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా మృతుని కుటుంబ సభ్యులను ఆదుకోవాలని సర్పంచ్ కోరారు.
