జనసేన పార్టీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు తీసుకోలేదు దీనితో హైదరాబాద్ లో జనసేన నవ నిర్మాణ సభ వాయిదా వేశారు మొదట ఈ సభ నిర్వహించేందుకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ హైకోర్టులో సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్ మంగళవారం మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సభకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ముందు సైబరాబాద్ పోలీసుల్ని అనుమతి కోరగా.. వారు కొన్ని కారణాలు చూపి సభకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. తెలంగాణ జనసేన నేతలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం కోర్టుకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో.. ఈ అత్యవసర పిటిషన్ ను రిజిస్ట్రీ పరిశీలించారు. ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించాల్సింది కాదని, ఇందులో అంత ఇంపార్టెంట్ ఏమీ లేదని పేర్కొంటూ.. విచారణకు తిరస్కరించారు
