పీసీసీ చీఫ్ మహేష్ ఫై తాను మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ స్పందించారు.
అది పూర్తిగా కల్పితమని తన వాయిస్ కాదన్నారు ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ క్రమశిక్షణా కమిటీ పంపిన లేఖకు ఆయన ఘాటైన వివరణ ఇచ్చారు. ఆ ఆడియో క్లిప్ పూర్తిగా నకిలీదని, ఎవరో కావాలనే సృష్టించిన కల్పితమైన అంశమని ఆయన స్పష్టం చేశారు.
“నాపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. క్రమశిక్షణ కమీటీ ఈ విషయమై నన్ను వివరణ కోరడానికి ముందే.. నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై నేను పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయించాను” అని వెల్లడించారు.
